అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Credit card | బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డు(Credit card)లు ఆఫర్ చేస్తుంటాయి. రివార్డ్ పాయింట్స్ అని, క్యాష్‌బ్యాక్(Cash back) అని, లాంజ్ యాక్సెస్ అని రకరకాల ప్రయోజనాల ఆశ చూపిస్తుంటాయి. కొన్ని కార్డులపై లైఫ్‌టైం ఎలాంటి చార్జీలు వసూలు చేయవు. మరికొన్నింటికి వార్షిక రుసుము(Annual charge)ను వసూలు చేస్తుంటాయి. అయితే బ్యాంక్ ఆఫర్ చేస్తోంది కదా అని ఏ కార్డు పడితే ఆ కార్డు తీసుకుంటే ప్రయోజనం లేకపోగా వార్షిక రుసుముల భారం భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువ రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ అందించే కార్డులు ఎంపిక చేసుకోవడం మంచిది. అయితే చాలావరకు క్రెడిట్ కార్డు కంపెనీలు (credit card companies) యుటిలిటీ బిల్స్, ఇన్సూరెన్స్, వాలెట్ లోడింగ్, స్కూల్ ఫీజులు, రైల్వే టికెట్ల రిజర్వేషన్లు, రెంట్ పేమెంట్, పెట్రోల్ బంక్‌లలో చేసే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ కానీ, రివార్డు పాయింట్లు కానీ ఇవ్వడం లేదు. ఇతర ఆన్‌లైన్ (Online), ఆఫ్‌లైన్ ట్రాన్జాక్షన్స్‌పై క్యాష్ బ్యాక్ అందించే క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందామా..
Credit card | అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు
ఈ కార్డుకు ఎలాంటి వార్షిక చందాను వసూలు చేయరు. అమెజాన్(Amazon)లో ఈ కార్డునుపయోగించి కొనుగోళ్లు చేసేవారికి అపరిమితంగా 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ ప్రైం సబ్‌స్క్రైబర్స్‌కు (Amazon Prime subscribers) 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ లావాదేవీలపై ఒక శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
Credit card | ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు
ఇది ఆన్‌లైన్ లావాదేవీలపై 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఆఫ్‌లైన్ ట్రాన్జాక్షన్స్‌పైనా ఒక శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పెట్రోల్ బంక్‌లలో రూ. 500 నుంచి రూ. 3వేల వరకు చేసే ట్రాన్జాక్షన్స్‌పై ఒక శాతం వరకు సర్‌చార్జి (Surcharge) మినహాయింపు ఉంటుంది. వార్షిక ఖర్చులు రూ. 2 లక్షలు దాటితే రెన్యువల్ ఫీ(రూ. 999) మినహాయింపు ఇస్తారు.
Credit card | ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు
ఈ కార్డును ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో చేసే అన్ని లావాదేవీలపై అపరిమితంగా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ లావాదేవీలపై ఒక శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వార్షిక రుసుము రూ. 500. సంవత్సరంలో రూ. 2 లక్షలపైన వినియోగించేవారికి ఈ రుసుమును రద్దు చేస్తారు. పెట్రోల్ బంక్‌లలో రూ. 400 నుంచి రూ. 4 వేల వరకు చేసే ట్రాన్జాక్షన్స్‌పై ఒక శాతం వరకు సర్‌చార్జి మినహాయింపు ఉంటుంది.
Credit card | మింత్రా కొటక్ క్రెడిట్ కార్డు
దీనికి వార్షిక చందా రూ. 500 ఉంటుంది. సంవత్సరంలో రూ. 50 వేలపైన ట్రాన్జాక్షన్స్ చేస్తే రెన్యువల్ ఫ్రీ. ఈ కార్డునుపయోగించి మింత్రా(Myntra)లో చేసే కొనుగోళ్లపై 7.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రాన్జాక్షన్స్‌పై 1.25 శాతం క్యాష్ బ్యాక్ అందుతుంది.
Credit card | హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డు
అమెజాన్, బుక్‌మై షో (Book My show), ఫ్లిప్‌కార్ట్, మింత్రా, జొమాటో వంటి ఫ్లాట్‌ఫాంలలో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఇతర లావాదేవీలపై ఒక శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. రూ. 400 నుంచి రూ. 5 వేల వరకు ఫ్యుయల్(Fuel) లావాదేవీలపై ఒక శాతం వరకు సర్‌చార్జి మినహాయింపు వర్తిస్తుంది. ఈ కార్డుకు వార్షిక రుసుము రూ. 999. ఈ కార్డునుపయోగించి సంవత్సరంలో లక్ష రూపాయల కొనుగోళ్లు జరిపితే రెన్యువల్ ఫీ ఉండదు.
