అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka) తెలిపారు. రాష్ట్ర సాంఘిక గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (Best Available Schools) విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతులు అమలుపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొనసాగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు రజిత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, గిరిజన అభివృద్ధి అధికారి నాగోరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.