అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని బోధన్ జేఏసీ నాయకులు నవాతే ప్రతాప్ (Bodhan JAC leader Navate Pratap) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 300 స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కీం (Best Available Scheme) అమలు అవుతోందన్నారు. సుమారు రూ.250 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను రానివ్వడం లేదని వివరించారు. ఈ కారణంగా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల (students) జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు.
వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) స్పందించి బకాయిలను విడుదల చేస్తే విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, ఆర్ గౌతం కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్, మోహన్, కిరణ్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.