అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru traveler bus accident | ఇటీవల జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు Road Accidents ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. బస్సు ప్రయాణం సేఫ్ అని చాలా మంది అందులో ప్రయాణిస్తున్నప్పటికీ ప్రమాదాల వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. Karnataka బెంగళూరులోని సిరా–హిరియూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెలర్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, ముందుగా వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదంగా మారింది.
Bengaluru traveler bus accident | ఘోర ప్రమాదం..
ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు బస్సులోనే Bus చిక్కుకుని సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉండగా, 9 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన 9 మందిని సిరాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కంటెయినర్‌ను Container ఢీకొన్న సమయంలో బస్సులోని డీజిల్ ట్యాంక్ పేలడంతోనే మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు బయటకు వచ్చేలోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో కూడా ఇలాంటి బస్సు ప్రమాదం జరగడంతో దాదాపు 19 మందికి పైగా అగ్నికి ఆహుతయ్యారు.
VIDEO | Chitradurga, Karnataka: Over 10 people are feared dead in a lorry-bus collision on National Highway 48 near Gorlathu village in Hiriyur taluk.
The bus, travelling from Bengaluru to Shivamogga, caught fire following the crash. Nine passengers reportedly escaped unhurt,… pic.twitter.com/dj75qIiIws
— Press Trust of India (@PTI_News) December 25, 2025