Bengaluru Stampede
Bengaluru Stampede | నా కొడుకు శ‌రీరాన్ని ముక్క‌లు చేయొద్దు.. తండ్రి ఆవేద‌న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bengaluru Stampede | విజయోత్సవ సభ కాస్త సంతాప సభగా మారి చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో తీవ్ర వేద‌న‌లు మిన్నంటాయి. 17 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ RCB తొలిసారి క‌ప్ కొట్ట‌డంతో వారంతా స‌ర‌దాగా సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంటే ఆ సంద‌డిని ప్ర‌త్య‌క్షంగా చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారు.ఈ క్ర‌మంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌(Stampede)లో 11 మంది మృతితోపాటు పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. యావత్‌ ప్రజానీకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) మాత్రం సంచలన ప్రకటన చేసింది. ‘మేం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’ అని ప్రకటించడం కలకలం రేపింది. తొక్కిసలాటపై ఆర్సీబీ స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.

Bengaluru Stampede | కోయ‌కండి…

చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్‌సీబీ సంబరం చిన్నబోయింది.సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు ఆర్సీబీ ప‌రేడ్ వేడుకల్లో భాగం కావడంతో పోలీసులు Police వారి చుట్టే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారుదాంతో చిన్నస్వామి స్టేడియం వద్ద పోలీసుల సంఖ్య తగ్గింది. ఆ సమయంలోనే వర్షం పడటంతో ఆర్‌సీబీ ఓపెన్ బస్ పరేడ్‌(Open bus parade)ను రద్దు చేశారు. దాంతో అయోమయానికి గురైన అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. అంద‌రు ఒక్క‌సారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి తండ్రి Father కన్నీటి పర్యంతమయ్యాడు. ‘నాకు ఒక్కడే కొడుకు. ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. తొక్కిసలాటలో అతడు చనిపోయాడు. ముఖ్యమంత్రి(Chief Minister), ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మా ఇంటికి వచ్చి పరామర్శించినా.. ఈ లోకాన్ని విడిచిన నా బిడ్డను మాత్రం ఎవ‌రు తీసుకురాలేరు. అందుకే అతడి మృతదేహాన్ని అయినా మాకు అప్పగించండి. పోస్ట్‌మార్టం పేరుతో నా కొడుకు శరీరాన్ని మాత్రం ముక్కలు చేయొద్దు’ అని కర్ణాటక సర్కారు(Karnataka Government)ను కోరాడు ఓ తండ్రి. అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆర్సీబీ తొక్కిసలాటలో చనిపోయిన వారికి పంచనామా పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు.