HomeUncategorizedBengaluru Stampede | కొడుకు స‌మాధిపై ప‌డి తండ్రి రోద‌న‌.. హృదయాలను పిండేసే ఘటన..

Bengaluru Stampede | కొడుకు స‌మాధిపై ప‌డి తండ్రి రోద‌న‌.. హృదయాలను పిండేసే ఘటన..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Stampede | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా నిర్వహించిన విజ‌యోత్స‌వ ర్యాలీలో 11 మంది దుర్మ‌ర‌ణం చెందిన విషయం తెలిసిందే..

సంతోషంగా త‌మ అభిమాన ఆట‌గాళ్ల‌ని చూడ్డానికి వెళ్లిన వారి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు భూమిక్ తండ్రి భావోద్వేగ వీడియో (Video) వెలుగులోకి వచ్చింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో (RCB victory rally) ప్రాణాలు కోల్పోయిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ తండ్రి బిటి లక్ష్యణ్ కొడుకు పోయిన బాధ‌ని జీర్ణించుకోలేక‌పోతున్నాడు. అత‌ని భావోద్వేగ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో.. బిటీ లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై ప‌డుకొని బోరున విలపిస్తున్నారు. తన కుమారుడికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదంటూ.. ఆయన రోధిస్తున్నారు.

Bengaluru Stampede | ఎమోష‌న‌ల్ వీడియో..

తాను ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదని.. తన కుమారుడి సమాధి వద్దే ఉండాలనుకుంటున్న‌ట్టు చెప్పారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌క్కకు తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఆయ‌న ఆ విలపిస్తూనే ఉన్నారు. తాను ప‌డిన బాధ ఏ తండ్రికి రావొద్దంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్స్ కూడా క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.

కాగా.. ఈ తొక్కిసలాటకు పోలీసులే బాధ్యులని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. అనంతరం.. పోలీస్ కమిషనర్ (Police Commisioner) సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. తర్వాత.. కర్ణాటక ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్(Karnataka IPS officer Seemant Kumar Singh)ను బెంగళూరు కొత్త కమిషనర్ గా నియమించారు.

మ‌రోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) విజయోత్సవ వేడుకల్లో మరణించిన కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచింది. ముందుగా రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government).. తాజాగా రూ. 25 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి టైటిల్‌ను ముద్దాడింది. క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్, కోశాధికారి జైరామ్ తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీకి రాజీనామా పత్రాలను పంపించారు. బెంగళూరు (Bengaluru) తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశామని అందులో పేర్కొన్నారు. వెంటనే వాటిని ఆమోదించాలని కోరారు.