అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం(karnataka capital bengaluru) వర్ష బీభత్సం నుంచి ఇంకా కోలుకోలేదు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నగరవాసుల్లో భయాందోళన రేకెత్తించింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో ఐటీ నగరం (IT city) అతలాకుతలమైంది. మృతుల సంఖ్య మూడుకు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం నీరు నిలిచే ఉంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షంతో బెంగళూరు నగరం (bengaluru city) స్తంభించిపోయింది. నివాస సముదాయాల్లోకి నీరు చేరింది. మరోవైపు, నీటిని తొలగించేందుకు యత్నిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ (electric shock) తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో 63 ఏళ్ల మన్మోహన్ కామత్, 12 ఏళ్ల దినేష్ ఉన్నారు. మరో సంఘటనలో, బెంగళూరులోని మహదేవపురలో గోడ కూలి ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ మరణించింది. మృతురాలు శశికళ ఆ ప్రాంతంలోని IZMO లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో(software company) హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కంపెనీ ఆవరణలోని ఒక కాంపౌండ్ గోడ కూలి శశికళపై పడిందని, ఆమె అక్కడికక్కడే మరణించారని తెలుస్తోంది. రాత్రిపూట కురిసిన భారీ వర్షానికి గోడ బలహీనపడిందని సమాచారం.
Bengaluru | నష్టం అంచనా వేస్తున్న అధికారులు
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు 130 మి.మీ వర్షపాతంతో దెబ్బతిన్న బెంగళూరు (bengaluru) తన నష్టాలను లెక్కించడానికి ప్రయత్నిస్తోంది. ముగ్గురు మృతి చెందగా, 500 ఇళ్లు నీట మునిగాయి. వరదలతో నిండిన అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లు ట్రాఫిక్‌కు మూసివేశారు. వైట్‌ఫీల్డ్ నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న కెంగేరిలోని కోటే లేఅవుట్‌లో 100 ఇళ్లలోకి నీరు చేరింది. వందకు పైగా కార్లు, బైకులు (cars and bikes) కొట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటున్న తరుణంలో నష్టం అంచనా వేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.