అక్షరటుడే, వెబ్‌డెస్క్:Bengaluru | ఈ మధ్య కొన్ని ప్రేమ జంటలు అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. మనం సొసైటీ(Society)లో ఉన్నామనే విషయాన్ని మరిచి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి. వారిపై ఎన్ని కఠన చర్యలు తీసుకుంటున్నా కూడా మార్పు రావడం లేదు.
బైక్, కారులో ప్రయాణిస్తూ చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు నడిరోడ్డుపై పబ్లిక్‌గానే రొమాన్స్ (Romance in public) చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా చోటు చేసుకోవడం మనం చూశాం. ఈ మధ్య ఏపీ, తెలంగాణలోనూ Telangana వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా ఈ సంస్కృతి కర్ణాటకకు పాకింది. బెంగళూరులోని రద్దీగా ఉండే ట్రినిటీ రోడ్డుపై కదులుతున్న కారు సన్‌రూఫ్ ద్వారా ఒక యువ జంట రొమాన్స్ చేసుకుంటూ కెమెరాలకి చిక్కింది.
Bengaluru | ఇదేం పోయే కాలం..
వైరల్‌గా మారిన వీడియోలో ఇద్దరు కూడా బహిరంగంగా, గాఢంగా లిప్ కిస్‌లు ఇస్తూ కనిపించారు. వాహనం కదులుతున్న సమయంలో చుట్టు నలుగురు ఉన్నారనే విషయాన్ని మరిచి ఈ చర్యలు చేయడం ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. హలసూరు ట్రాఫిక్ పోలీసుల (Halasur Traffic Police) అధికార పరిధిలో జరిగింది. ఇది పబ్లిక్ స్థలాల్లో Public Places నీతి సంబంధమైన అనుచిత ప్రవర్తన మాత్రమే కాక, రోడ్డు భద్రత గురించి కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని పలువురు చెబుతున్నారు. పబ్లిక్ రోడ్లు ప్రైవేట్ లాంజ్‌లుగా మారినట్లు, ఈ రకమైన ప్రవర్తనను ఎటువంటి పరిణామాల భయం లేకుండా బహిరంగంగా ప్రదర్శించడం ఏంటని తిట్టిపోస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ జంటకు జరిమానా విధించారు. ‘కర్ణాటక పోర్ట్‌ఫోలియో’ (Karnataka Portfolio) అనే ఎక్స్ ఖాతా ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు(Police) కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించి రూ.1,500 జరిమానా విధించారు. ఇందులో ప్రమాదకరమైన డ్రైవింగ్ కోసం రూ.1,000, సాధారణ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద అదనంగా రూ.500 ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ జంటపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మరింత కఠిన శిక్ష అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
https://www.instagram.com/reel/DKJlYdhz_5W/?utm_source=ig_web_copy_link