IPL 2025 | బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. 101 పరుగులకే పంజాబ్​ అలౌట్​
IPL 2025 | బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. 101 పరుగులకే పంజాబ్​ అలౌట్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 : బెంగళూరు బౌలర్ల(Bengaluru bowlers) ధాటికి పంజాబ్​ బ్యాటర్లు(Punjab batsmen) వెలవెలబోయారు. ఆర్సీబీ(royal challengers bengaluru – RCB)తో జరిగిన తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 14.1 ఓవర్లలో 101 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్(26) టాప్ స్కోరర్. ప్రభ్సమ్రన్ సింగ్(18), ఒమర్జాయ్(18) రన్స్ చేశారు.

నేహల్ వధేరా (8), ప్రియాంశ్ ఆర్య (7), జోష్ ఇంగ్లిస్ (4), శశాంక్ సింగ్ (3), శ్రేయస్ అయ్యర్ (2) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పంజాబ్​ అభిమానులను నిరుత్సాహపర్చింది. ఆర్సీబీ బౌలర్లలో హేజిలవుడ్ 3, సుయాశ్ శర్మ 3, యశ్ దయాళ్ 2, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.