Homeబిజినెస్​Global Tech Hub | వ‌ర‌ల్డ్ టెక్ హ‌బ్‌గా బెంగ‌ళూరు.. 10 ల‌క్ష‌లు దాటిన టెక్...

Global Tech Hub | వ‌ర‌ల్డ్ టెక్ హ‌బ్‌గా బెంగ‌ళూరు.. 10 ల‌క్ష‌లు దాటిన టెక్ వ‌ర్క్ ఫోర్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global Tech Hub : క‌ర్ణాట‌క(Karnataka) రాజ‌ధాని బెంగ‌ళూరు(Bengaluru) సాఫ్ట్‌వేర్ కేంద్రంగా మారింది. ఈ మెట్రోపాలిట‌న్ సిటీ ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా పేరొందింది.

ప్ర‌పంచ ప్రసిద్ధి గాంచిన బీజింగ్ (Beijing), బోస్టన్ (Boston), లండన్ (London), న్యూయార్క్ మెట్రో (New York Metro), పారిస్ (Paris), శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (San Francisco Bay Area), సీటెల్ (Seattle), షాంఘై (Shanghai), సింగపూర్ (Singapore), టోక్యో (Tokyo), టొరంటో (Toronto) వంటి ప్రపంచ దిగ్గజాల స‌ర‌స‌న బెంగ‌ళూరు నిలిచింది.

ఈ న‌గ‌రంలో ప‌ది ల‌క్ష‌ల (1 మిలియన్) మంది టెక్ వర్క్‌ఫోర్స్(tech workforce) మైలురాయిని దాటిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ (real estate consultancy) CBRE నివేదిక వెల్ల‌డించింది. ‘గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్‌బుక్ 2025’ ప్రపంచవ్యాప్తంగా 115 మార్కెట్‌లను లభ్యత, నాణ్యత, టెక్ టాలెంట్ ఖర్చు ఆధారంగా మూల్యాంకనం చేసింది. వాటిని పవర్‌హౌస్, ఎస్టాబ్లిష్డ్, ఎమర్జింగ్ మార్కెట్‌లుగా వర్గీకరించింది.

ఈ నివేదిక బెంగళూరును 12 ప్రపంచ “పవర్‌హౌస్” (powerhouse) టెక్ మార్కెట్‌లలో ఒకటిగా గుర్తించింది. “బెంగళూరు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద టెక్ టాలెంట్ మార్కెట్, బీజింగ్, షాంఘైలతో పాటు దాని టెక్ వర్క్‌ఫోర్స్ 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువగా ఉంది” అని CBRE నివేదిక వెల్ల‌డించింది.

Global Tech Hub : డిజిట‌ల్ ఆవిష్క‌ర‌ణ‌లో ముందంజ‌..

డిజిట‌ల్ ఆవిష్క‌ర‌ణ‌, ఏఐ నిర్వ‌హ‌ణ‌లో ముందున్న బెంగ‌ళూరు భారతదేశ వ్యూహాత్మకత‌ను ప్రతిబింబిస్తుందని CBRE చైర్మన్, సీఈవో అన్షుమాన్ తెలిపారు. ఏఐ నిపుణులు క‌లిగి ఉన్న అతిపెద్ద న‌గ‌రాలైన శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి వాటి స‌ర‌స‌న బెంగ‌ళూరు నిలిచింద‌ని తెలిపారు. జనాభా పరంగా క‌ర్ణాట‌క రాజ‌ధాని న‌గ‌రం 12 పవర్‌హౌస్‌లలో నాల్గవ స్థానంలో ఉంది.

మంచి స్టార్టప్ వాతావరణం, 28 యునికార్న్‌ల మద్దతుతో, అనుకూలమైన నిబంధనలు, బలమైన సంస్థాగత మద్దతుతో బెంగళూరు ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాతి గాంచింది. AI, డేటా సైన్స్ (data science), ఇంజినీరింగ్‌ (engineering), మ్యానుఫాక్చ‌రింగ్ (manufacturing) రంగంలో అభివృద్ధి కార‌ణంగా 2018 – 2023 మధ్య టెక్ ఉపాధిలో 12% పెరుగుదల న‌మోదైంది.

ఇది గణనీయమైన వెంచర్ క్యాపిటల్ నిధులను కూడా ఆకర్షించింది. బెంగళూరు 2024లో 3.3 బిలియన్ డాల‌ర్ల విలువైన 140 వెంచ‌ర్ క్యాపిట‌ల్ ఒప్పందాలను పొందింది. వీటిలో 34 AIపై దృష్టి సారించాయి.

Must Read
Related News