అక్షరటుడే, ఆర్మూర్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ (Armoor)లో బంగారం వర్తకులకు పెద్ద మొత్తంలో టోకరా ఇచ్చాడో పశ్చిమ బెంగాల్ వర్కర్ (West Bengal Worker). అరకిలోకు పైగా గోల్డ్ ఎత్తుకుని పారిపోయాడు. దీంతో బాధిత వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
Armoor Gold traders cheated : వివరాలోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఆర్మూర్ ప్రాంతంలోని గోల్డ్ (Gold) షాప్‌లలో బంగారు నగలకు తుది మెరుగులు (gold jewelry finishing) దిద్దేవాడు. భూపాల్‌కు పది మంది గోల్డ్ షాప్ యజమానులు సుమారు అరకిలో బంగారు నగలను తుది మెరుగులు దిద్దడానికి ఇచ్చారు.
అదే అదునుగా భావించిన భూపాల్ అరకిలో బంగారు నగలను తీసుకుని బుధవారం (ఆగస్టు 6) రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఎనిమిది ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్మూర్ ప్రాంతానికి భూపాల్ కుటుంబ సమేతంగా వచ్చాడు. ఆర్మూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
Armoor Gold traders cheated : నమ్మించి నట్టేట ముంచి..
అప్పటి నుంచి బంగారు నగలకు తుదిమెరుగులు దిద్దుతూ జీవనం సాగిస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ రావడంతో తాజాగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సుమారు 10 మంది గోల్డ్ షాప్ యజమానులు నగల తుదిమెరుగుల కోసం సుమారు అర కిలోకు పైగా బంగారాన్ని బెంగాలీ వర్కర్ భూపాల్‌కు ఇచ్చారు.
పెద్ద మొత్తంలో బంగారం చూడటంతో భూపాల్‌కు వక్రబుద్ధి పుట్టింది. ఇంకేం ఆ మొత్తం బంగారాన్ని తీసుకుని రాత్రికి రాత్రే కుటుంబంతో సహా బెంగాల్‌కు పారిపోయాడు. గోల్డ్ వర్తకులతోపాటు భూపాల్ ఇంటి యజమాని 3 తులాల బంగారం ఇచ్చి మోసపోయినట్లు తెలిసింది.
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రానికి చెందిన బంగారు నగల తుది మెరుగులు దిద్ది వర్కర్ చేతిలో మోసపోయిన ఆర్మూర్ ప్రాంతానికి చెందిన గోల్డ్ షాప్ దుకాణదారులు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాగైనా భూపాల్‌ను పట్టుకుని బంగారం అప్పగించాలని విన్నవించినట్లు తెలిసింది.