అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengal tiger | నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బెంగాల్ టైగర్ (Bengal tiger) కనిపించింది. శిఖర్ ఘర్ ప్రాంతంలో పర్యాటకులకు పులి తారసపడింది. ఈ పెద్దపులి కదలికలను సందర్శకులు తమ కెమెరాల్లో బంధించారు. కాగా.. నాగర్ కర్నూల్ జిల్లాలో (Nagarkurnool district) గతంలోనూ పలుమార్లు పెద్దపులి కనిపించింది. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పాద ముద్రలు సేకరించారు.
