Homeతెలంగాణretired employees | రిటైర్డ్ ఉద్యోగులకు ద‌క్క‌ని ప్ర‌యోజ‌నాలు.. నెల‌ల త‌ర‌బ‌డి వేలాది మంది ఎదురుచూపులు

retired employees | రిటైర్డ్ ఉద్యోగులకు ద‌క్క‌ని ప్ర‌యోజ‌నాలు.. నెల‌ల త‌ర‌బ‌డి వేలాది మంది ఎదురుచూపులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: retired employees | ద‌శాబ్దాల పాటు ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించి ప‌ద‌వీ విర‌మ‌ణ retired పొందిన ఉద్యోగుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. రిటైర్‌మెంట్ బెనిఫెట్స్ retirement benefits రాక వారిలో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. అవ‌సాన ద‌శ‌లో త‌మ‌కు అక్క‌ర‌కు ప‌నికొస్తాయ‌నుకున్న డబ్బులు రాక‌పోవ‌డంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఏ ఉద్యోగి అయినా రిటైర్ కాగానే వారికి వెంట వెంట‌నే అన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పించాలి. జీపీఏతో GPA పాటు గ్రాట్యూటీ ఇత‌ర బెనిఫెట్స్ కూడా అందించాలి. కానీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి financial situation దృష్ట్యా ప్ర‌భుత్వం government రిటైర్డ్ ఉద్యోగుల‌కు చెల్లింపుల‌ను payments పెండింగ్‌లో పెట్టింది. దీంతో వారు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ రావాల్సిన బ‌కాయిలు ఇప్పించాల‌ని కొంద‌రైతే ఏకంగా కోర్టుకు court వెళ్తున్నారు.

retired employees | ఎందుకిలా..?

ప్ర‌భుత్వ కొలువుల్లో సేవలందించిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ retirement త‌ర్వాత ఆ మేర‌కు ప్రయోజ‌నాలు క‌ల్పించాలి. కానీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి state financial situation దారుణంగా ఉంది. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ real estate స‌హా అన్ని రంగాలు కుదేల‌య్యాయి. దీంతో ప్ర‌భుత్వానికి రాబ‌డి government revenue ప‌డిపోయింది. నెల‌నెలా వేత‌నాల చెల్లింపులు, ప‌థ‌కాల కొన‌సాగింపునకే ఆదాయం స‌రిపోవ‌డం లేదు. కేంద్ర‌ ప్ర‌భుత్వం central government నుంచి వ‌చ్చే గ్రాంట్స్ కూడా స‌రిగ్గా రావ‌డం లేదు. ఆదాయ, వ్య‌యాల న‌డుమ‌ అంచ‌నాలకు మించిన‌ వ్య‌త్యాసం పెరుగుతున్న‌ది. ఈక్ర‌మంలో రెవెన్యూలోటు పెరిగిపోతోంది.

retired employees | వేలాది మంది ఎదురుచూపులు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు government employees ఉండగా, వారిలో ఉపాధ్యాయులే teachers దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. ప్ర‌తి నెలా ఎంతో కొంత మంది రిటైర్డ్ అవుతున్నారు. ఉద్యోగ విరమణ వయస్సును కేసీఆర్ ప్రభుత్వం KCR government 2021లో 58 నుంచి 61కి పెంచింది. ఆ గడువు గతేడాది మార్చితో ముగిసింది. 2024 మార్చి నెలాఖరు నుంచి ప్రతినెలా దాదాపు 800-1000 మంది ఉద్యోగ విరమణ పొందుతుండగా వారిలో సగటు 350 -400 మంది ఉపాధ్యాయులే teachers ఉంటున్నారు. గత 11 నెలల కాలంలో సుమారు 8 వేల మంది ఉద్యోగ విరమణ పొందగా, వారిలో 4 వేల మంది దాకా టీచ‌ర్లే ఉన్నారు. అయితే, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ retirement benefits (ఆర్థిక ప్రయోజనాలు) అందక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడిగా teacher గ్రాట్యూటీ, జీపీఎఫ్‌, గ్రూప్ ఇన్సూరెన్స్ group insurance, స‌రెండ‌ర్ లీవులు క‌లిపి స‌గ‌టున రూ.30 ల‌క్ష‌ల దాకా బ‌కాయిలు రావాల్సి ఉన్న‌ట్లు చెబుతున్నారు. కానీ ప్ర‌భుత్వం government ఇవ్వ‌డం లేదు. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల‌కే retired teachers మొత్తం రూ.1500 కోట్ల దాకా చెల్లించాల్సి ఉన్న‌ట్లు తెలిసింది. ఇక మిగ‌తా శాఖ‌ల వారిని కూడా క‌లిపితే రూ.3 వేల కోట్లు కావాల‌ని చెబుతున్నారు.

retired employees | కోర్టులే దిక్కు..

దీంతో కొంద‌రు రిటైర్డ్ ఉద్యోగులు retired employees కోర్టుల‌ను courts ఆశ్ర‌యిస్తున్నారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది విశ్రాంత ఉపాధ్యాయులు retired teachers న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ retirement benefits ఇవ్వాల‌ని కోర్టులు ఆదేశించ‌డంతో ప్ర‌భుత్వం government త‌ప్ప‌నిస‌రై వారికి మాత్ర‌మే ఇస్తోంది. మిగ‌తా వారికి మాత్రం ఇవ్వ‌డం లేదు. దీంతో ఇతర శాఖల ఉద్యోగులూ కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.