Double Bedroom Scheme | డబుల్ ఇళ్ల పట్టాల కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు

అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom Scheme | ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్​రూం​ ఇళ్లకు పట్టాలు ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి (Kamareddy) తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులు చేసి ఏళ్లు గడుస్తోందన్నారు. ఇళ్లవద్ద వసతుల కోసం కలెక్టరేట్ (Kamareddy Collectorate) వద్ద ధర్నా చేస్తే తప్పా సరైన […]

అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom Scheme | ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్​రూం​ ఇళ్లకు పట్టాలు ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి (Kamareddy) తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులు చేసి ఏళ్లు గడుస్తోందన్నారు. ఇళ్లవద్ద వసతుల కోసం కలెక్టరేట్ (Kamareddy Collectorate) వద్ద ధర్నా చేస్తే తప్పా సరైన వసతులు కల్పించలేదన్నారు.

Double Bedroom Scheme | రోడ్డు కూడా లేదు..

ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేదని, ముఖ్యంగా ఇళ్లపట్టాలు లేక తమకు గుర్తింపు లభించడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ధర్నాలు చేస్తేనే వసతులు కల్పిస్తారా అని ప్రశ్నించారు. డబుల్ ఇళ్లు ఇచ్చారని సంబరపడడమే తప్పా పట్టాలు ఇవ్వకపోవడంతో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.