HomeతెలంగాణRation Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్​ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేషన్​ దుకాణాల్లో(ration shops) మూడు నెలల రేషన్​ పంపిణీ చేస్తున్నారు. అయితే ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్​ దుకాణాల్లో ఆలస్యం అవుతోంది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Ration Rice | సర్వర్​ సమస్య

రేషన్​ దుకాణాల్లో సర్వర్​ సమస్యతో బియ్యం పంపిణీ(Rice distribution) ఆలస్యం అవుతోంది. దీంతో లబ్ధిదారులు ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో మూడు సార్లు వేలిముద్రలు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరు రేషన్​ తీసుకోవడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. దీంతో దుకాణాల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

Ration Rice | అయిపోయిన బియ్యం

పలు రేషన్​ దుకాణాల్లో బియ్యం అయిపోయాయి. దీంతో డీలర్లు దుకాణాలను మూసి వేశారు. కొత్తగా బియ్యం వచ్చే వరకు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నిత్యం లబ్ధిదారులు రేషన్​ దుకాణానికి వచ్చి అడిగి వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల బియ్యం పంపిణీ కొనసాగుతున్నా.. ఆలస్యం అవుతుండటంతో భారీ సంఖ్యలో ప్రజలు వేచి ఉంటున్నారు. దుకాణాల వద్ద లైన్లో సంచులను పెట్టి బియ్యం తీసుకోవడానికి నిరీక్షిస్తున్నారు.