ePaper
More
    Homeతెలంగాణbellamkonda srinivas | కారుతో కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన టాలీవుడ్ హీరో.. ఎందుకంత ఓవ‌రాక్ష‌న్ అంటున్న...

    bellamkonda srinivas | కారుతో కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన టాలీవుడ్ హీరో.. ఎందుకంత ఓవ‌రాక్ష‌న్ అంటున్న నెటిజ‌న్స్..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: bellamkonda srinivas : ఇటీవ‌ల టాలీవుడ్ సెల‌బ్రిటీలు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఏదో ఒక త‌ప్పు చేయ‌డం చిక్కుల్లో ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ Srinivas రాంగ్ రూట్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. నేడు శ్రీనివాస్ కార్ లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వ‌చ్చి హల్ చ‌ల్ చేశాడు. రాంగ్ రూట్ లో కారుతో ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో సైలెంట్ గా వెళ్లిపోయాడు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్‌లో రావడం ఒక తప్పు అయితే.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడం మరో తప్పు.

    ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు.. ఇలా రాంగ్ రూట్‌లో రాకూడదు. మీరు ఇలా రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు కానిస్టేబుల్ తెలియజేశాడు. కానిస్టేబుల్‌ హీరోని అడ్డుకుని రోడ్డుపైనే నిలదీయ‌డంతో చేసేదేం లేక సైలెంట్‌గా జారుకున్నారు శ్రీనివాస్‌. ఇది హీరో కావాలనే చేశాడా? ఇందులో సినిమా స్టంట్‌ ఏదైనా ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ భైరవం Bhairavam అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్‌, నారా రోహిత్‌ లు మరో హీరోలు. ముగ్గురు కలిసి నటించిన ఈ చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్‌ నిర్మించారు. మూవీ మే 30న విడుదల కాబోతుంది.

    ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు బెల్లంకొండ కూడా అలానే చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాయి శ్రీనివాస్ న‌టిస్తున్న భైరవం సినిమా యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ..ఇది హిట్‌ అయితే బెల్లంకొండ హీరోగా ఫామ్‌లోకి వస్తారు. ఆయనతోపాటు నారా రోహిత్‌ Nara Rohit కూడా చాలా రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య చేసిన ప్రతినిధి 2 తేడా కొట్టింది. మరో మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఇక మంచు మనోజ్‌కి హీరోగా సినిమాలు లేక చాలా కాలం అవుతుంది. ఈ ముగ్గురు భైర‌వం మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...