HomeUncategorizedBEL Job offer | బీఈఎల్‌లో జాబ్ ఆఫ‌ర్‌.. నెలకు రూ.50వేల వేత‌నం!

BEL Job offer | బీఈఎల్‌లో జాబ్ ఆఫ‌ర్‌.. నెలకు రూ.50వేల వేత‌నం!

- Advertisement -

Akshara Today: BEL Job offer : నిరుద్యోగ యువ‌త నుంచి భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ BEL Jobs (బీఈఎల్‌) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈమేరకు జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల BEL junior assistant posts భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. అభ్య‌ర్థ‌లు ఈ నెల 20లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బీకాం, బీబీఏ లేదా బీబీఎం చ‌దివి, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉన్నవారు అర్హులు. అభ్యర్థుల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు స‌డ‌లింపు ఉంటుంది.

BEL Job offer : రాత ప‌రీక్ష ద్వారా ఎంపిక‌..

మే 20వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా http://bel-india.in/ వెబ్​సైట్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుతో పాటు రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ , పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది. రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల వేత‌నం, ఇత‌ర‌త్రా సౌకర్యాలు క‌ల్పిస్తారు.

Must Read
Related News