HomeజాతీయంBombay High Court | ముందు అప్రూవర్ గా మారండి.. శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు సూచన

Bombay High Court | ముందు అప్రూవర్ గా మారండి.. శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు సూచన

Bombay High Court | తనపై నమోదైన లుక్​ అవుట్​ నోటీసులను రద్దు చేయాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కోర్టులో పిటిషన్​ వేశారు. దీనిని న్యాయస్థానం కొట్టివేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bombay High Court | తనపై జారీ చేసిన లుక్ అవుట్ (ఎల్ వోసీ) నోటీసులు రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి (Bollywood actress Shilpa Shetty) చుక్కెదురైంది. విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఎల్ వోసీ రద్దు చేయాలన్న పిటిషన్ పై మంగళవారం విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆమె విదేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగా అప్రూవర్​గా మారాలని పేర్కొంది. వ్యాపార వేత్త దీపక్ కోఠారికి ఉద్దేశపూర్వకంగా రూ.60 కోట్ల నష్టం కలిగించారని శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులకు (Mumbai Police) చెందిన ఆర్థిన నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే శిల్పా దంపతులు దేశం విడిచి పారిపోకుండా ఎల్ వోసీ జారీ అయింది.

Bombay High Court | ఎల్ వోసీని రద్దు చేయాలని పిటిషన్..

యూట్యూబ్ ఈవెంట్ (YouTube event) కోసం శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె తనపై జారీ అయిన ఎల్ వోసీని రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘ముందుగా రూ.60 కోట్లు చెల్లించండి, తర్వాత మీ కేసును వింటాము’ అని చెప్పింది. శిల్పా పిటిషన్ ఈరోజు మరోసారి విచారణకు రాగా.. ‘మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, అప్రూవర్గా మారండి’ అని హితవు పలికింది.

Bombay High Court | విదేశీ ప్రయాణాలపై నిషేధం..

చీటింగ్ కేసులో శిల్పా, రాజ్ విదేశాలకు వెళ్లకుండా నిషేధిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. వారు లాస్ ఏంజిల్స్ (Los Angeles), అమెరికా, లేదా మరెక్కడికైనా విదేశాలకు వెళ్లాలనుకుంటే, ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. వారిపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (LOC)పై స్టే ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది.