అక్షరటుడే, వెబ్డెస్క్ : Beaver Super Moon | నవంబర్ నెల November ఆరంభంలో ఆకాశం ఒక అద్భుత దృశ్యంతో కనువిందు చేయనుంది. నవంబర్ 5 బుధవారం రాత్రి భూమికి అత్యంత సమీపంగా చేరిన చంద్రుడు తన పూర్తి కాంతితో (full light) ఆకాశాన్ని మైమరపించనున్నాడు.
దీనినే శాస్త్రవేత్తలు “బీవర్ సూపర్ మూన్” (Beaver Super Moon) అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే ఈ పౌర్ణమిని బీవర్ మూన్ అని అంటారు. ఈ పేరు పాత అమెరికన్ సాంప్రదాయాల (old American traditions) నుంచి వచ్చింది. ఈ కాలంలో బీవర్ జంతువులు తమ గూళ్లను సిద్ధం చేసుకుంటాయి. అందుకే ఈ పౌర్ణమికి ‘బీవర్ మూన్’ అనే పేరు వచ్చింది.
Beaver Super Moon | ఎప్పుడు అంటే..!
ఈసారి చంద్రుడు భూమికి (Earth) సుమారు 3,56,980 కిలోమీటర్ల దూరం వరకు చేరుకుంటాడు. అందువల్ల ఇది సాధారణ పౌర్ణమి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశంగా కనిపించింది. దీనినే “సూపర్ మూన్” అని అంటారు. తెల్లగా పెద్ద చంద్రుడు మేఘాల వెనుక నుంచి బయటికి వచ్చిన ప్రతి సారి ఆ దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో (Social Media) కూడా #BeaverSuperMoon ట్రెండ్ అవుతూ, నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్లో కోల్డ్ మూన్ రానుంది. అంటే వరుసగా రెండు నెలల్లో ఆకాశం మనకు అద్భుతమైన చంద్ర దృశ్యాలను అందించబోతుందన్న మాట.
ఈ ఏడాది చివరి సూపర్ మూన్ ఇదే. వచ్చే సూపర్ మూన్ Super Moon 2026లో మాత్రమే కనిపించనుంది. కాబట్టి ఈ నవంబర్ రాత్రి చంద్రుడు చూపించిన ఈ అద్భుతాన్ని చూడడం నిజంగా అదృష్టం అని ఖగోళ ప్రేమికులు అంటున్నారు. చంద్ర కాంతిలో నిండిన ఈ బీవర్ సూపర్ మూన్ రాత్రి ఆకాశాన్ని చూసిన ప్రతిఒక్కరికి మరిచిపోలేని అనుభూతినే అందించనుంది. ఈ బీవర్ మూన్ కోసం ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
