Miss-World-2025
Miss World 2025 | దేవర పాటకు స్టెప్పులేసిన అందాలభామలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miss World 2025 | మిస్​ వరల్డ్​ పోటీలు(Miss World competitions) హైదరాబాద్​ వేదికగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం వివిధ దేశాల పోటీదారులు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్​ చేశారు. ఎన్టీఆర్​ హీరోగా తెరకెక్కిన దేవర సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఈ క్రమంలో శనివారం గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో దేవర సినిమాలోని ఆయుధపూజ పాటకు సుందరీమణులు స్టెప్పులేసి అదరగొట్టారు.

Miss World 2025 | ఘనంగా స్పోర్ట్స్​ డే ఈవెంట్​

మిస్​ వరల్డ్​ పోటీల్లో భాగంగా నిత్యం వివిధ రకాల ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల అందగత్తెలకు తెలంగాణ చరిత్ర తెలిసేలా పలు ప్రదేశాలకు తీసుకెళ్లారు. హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద హెరిటేజ్​ వాక్​(Heritage Walk) చేపట్టారు. అనంతరం వరంగల్​లోని వేయి స్తంభాల గుడి, కాకతీయుల కోట, రామప్ప ఆలయం, బుద్ధవనం, యాదగిరిగుట్టను మిస్​ వరల్డ్​ పోటీదారులు సందర్శించారు. శనివారం హైదరాబాద్​లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్న వారికి స్పోర్ట్స్​ డే ఈవెంట్(Sports Day Event) నిర్వహించారు. క్రీడా జ్యోతితో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఈ వేడుకలను ప్రారంభించారు.

https://www.instagram.com/reel/DJv_Z_rIVK_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==