ePaper
More
    HomeజాతీయంNoida | డే కేర్ సెంటర్‌లో మీ పిల్ల‌ల‌ని వేయాల‌నుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే ఆ...

    Noida | డే కేర్ సెంటర్‌లో మీ పిల్ల‌ల‌ని వేయాల‌నుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే ఆ ఆలోచ‌న కూడా రాదు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida | నోయిడాలోని ఓ ప్రైవేట్ డే కేర్‌ (Day Care) సెంటర్​లో దారుణం జరిగింది. అక్కడ 15 నెలల పసిపాపపై పనిమనిషి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆగస్టు 4న చోటుచేసుకున్నట్లు సమాచారం. సీసీటీవీలో ఈ దాడి ఘటన రికార్డయ్యింది. డే కేర్ సెంటర్​ (day care center) నుంచి ఇంటికి తీసుకువచ్చిన అనంతరం చిన్నారిని త‌ల్లి గ‌మ‌నించింది. ఏడ‌వ‌డం, ఎంత ఓదార్చిన కూడా ఆప‌క‌పోవ‌డం, మ‌రోవైపు బట్టలు మార్చే సమయంలో బాలిక రెండు కాళ్ల‌పై భాగంలో వృత్తాకార గాయాల మచ్చలు కనిపించాయి.

    Noida | చిన్నారి అని చూడ‌కుండా..

    చిన్నారి తీవ్రంగా కొట్టడంతో అప్రమత్తమైన తల్లి వెంటనే బాలికను డాక్టర్‌ (Doctor) వద్దకు తీసుకెళ్లింది. వైద్యుడు పరిశీలించి ఆ గాయాలు మనిషి కొట్టిన గాయాల మాదిరిగా ఉన్నాయ‌ని తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు డే కేర్ సీసీటీవీ ఫుటేజ్‌ను (CCTV footage) పరిశీలించగా ఆ చిన్నారిపై పనిమనిషి హింసాత్మకంగా ప్రవర్తించిన దృశ్యాలు కనిపించాయి.

    పాప‌ని లాలించ‌కుండా క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆ చిన్నారి భ‌యంతో ఏడుస్తూనే ఉంది. ఫుటేజ్‌లో కనిపించిందేమిటంటే.. ఏడుస్తున్న చిన్నారిని పనిమనిషి మొదట శాంతింపజేయాలని ప్రయత్నించింది. కానీ బాలిక ఏడుపు ఆపకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, చిన్నారిని నేలపై పడేసింది. గది తలుపు మూసి, ఆమెను చెంపదెబ్బ కొట్టింది. అంతేగాక, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టిన దృశ్యాలూ వీడియోలో క‌నిపించాయి.

    ఇక ఇదే సమయంలో డే కేర్ నిర్వహణలో ఉన్న వారు ఈ దృశ్యాలను గమనించినప్పటికీ ఏ మాత్రం స్పందించ‌లేద‌ని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా, వారిని నిలదీయగా, నిర్వాహకురాలు, పనిమనిషి కలిసి దురుసుగా ప్రవర్తించారని, బెదిరించారంటూ తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు (medical examination) నిర్వహించి, నిందితురాలైన పనిమనిషిని అరెస్టు చేశారు. ఈ సంఘటన చిన్నారుల భద్రతపై ప్రశ్నలు త‌లెత్తేలా చేస్తుంది. డే కేర్‌ సెంటర్లలో పర్యవేక్షణ, బాధ్యత అంశాల్లో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకంగా మారింది.

    Latest articles

    Minimum balance | బ్యాంక్​ ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​పై ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum balance | ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​ లేకపోతే పలు బ్యాంకులు ఫైన్​ వేస్తున్న విషయం...

    Amazon | నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం పెట్టుబడి పెట్టిన అమెజాన్

    అక్షరటుడే, హైదరాబాద్: Amazon | భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా...

    MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్...

    Bodhan mla | కంఠేశ్వర్ ఆలయంలో హాల్​ నిర్మాణానికి కృషి చేస్తా..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan mla | నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాల్​తో పాటు,...

    More like this