అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral video | సోషల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు చూసి భయాందోళనకి కూడా గురవుతుంటాం. తాజాగా సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొడుతున్న వీడియోని చూసి అందరు నోరెళ్లపెట్టారు. సాధారణంగా జంతు ప్రదర్శనల శాలలో సందర్శకుల ప్రవర్తనతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. పులులు, సింహాల వంటి ప్రమాదకర జంతువుల సమీపానికి వెళ్లే వారి వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ ఘటన పోలాండ్‌లోని (Poland) వార్సా జూలో చోటు చేసుకుంది.
Viral video | బతికి బట్టకట్టాడు
వివరాల్లోకి వెళ్తే 23 ఏళ్ల ఓ యువకుడు మద్యం సేవించి జూలోకి (Zoo) వెళ్లాడు. అక్కడ ఉన్న జంతువులను దూరం నుంచి చూడకుండా ఏకంగా ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. దానిని దగ్గరగా చూడాలన్న ఆశతో అడుగులు వేశాడు. అనంతరం ఎలుగుబంటి తన వైపునకు వస్తుందని గమనించిన ఆ యువకుడు ఒక్కసారిగా భయంతో నీళ్లలోకి దూకేశాడు. కానీ ఎలుగుబంటి ఆగలేదు. అది కూడా నీళ్లలోకి దూకి అతనిపై దాడికి యత్నించింది. యువకుడు ఎలుగుబంటిని నీళ్లలో ముంచి దాన్ని అడ్డుకున్నాడు. మధ్యలో ఎలుగుబంటి మళ్లీ పైకి రావడానికి ప్రయత్నించినా అతను ధైర్యంగా దాన్ని తోసి దూరం నెట్టాడు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటకు తీశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు ఇప్పటికే 2.2 మిలియన్లకు పైగా వ్యూస్, 12 వేలపై చిలుకు లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మందుబాబు ఏకంగా ఎలుగుబంటితో (Bear) యుద్ధమే చేశాడు.. అదృష్టం అతడిని కాపాడింది అంటూ విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైన అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి సేఫ్‌గా బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు మన దేశంలో కూడా చాలానే జరిగాయి.
If this wasn’t filmed no one would ever believe him 😂 pic.twitter.com/qOWHW1vfnx
— OnlyBangers (@OnlyBangersEth) August 1, 2025