అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. తిమ్మారెడ్డి గ్రామ శివారులోని రామలింగం బావి భగీరథ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్లిన వారికి ఎలుగుబంటి కనిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
