అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy Collector | జిల్లాలో కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ప్రజలు నీటి వనరుల వద్దకు వెళ్లిన సమయంలో అప్రమత్తండా ఉండాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటనలో విడుదల చేశారు.
ప్రాజెక్టులు, చెరువుల వద్దకు చేపల వేట, ఈత కొట్టేందుకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దన్నారు. భారీ వర్షాలకు (heavy rains) వాగులు పొంగి పొర్లుతున్నాయని, లోలెవెల్ వంతెనల వద్ద వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఇక, ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.