అక్షరటుడే, బోధన్: Sub Collector Vikas Mahato | సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలం దృష్ట్యా జీపీల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. డెంగీ (Dengue), మలేరియా (Malaria) వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఎంపీడీవో బాల లింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.