Homeజిల్లాలుకామారెడ్డిSeasonal Diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంఈ నరేంద్ర కుమార్

Seasonal Diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంఈ నరేంద్ర కుమార్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Seasonal Diseases | ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంఈ డాక్టర్​ నరేంద్ర కుమార్ (DME Dr. Narendra Kumar) వైద్యులకు సూచించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్​ అజయ్ కుమార్​తో కలిసి శనివారం కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH), దేవి ఆస్పత్రి, దోమకొండ సీహెచ్​సీ, భిక్కనూరు పీహెచ్​సీలను సందర్శించారు.

ఈ సందర్భంగా జీజీహెచ్​లో సీజనల్ వ్యాధుల (seasonal diseases) వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులను పరిశీలించారు. రోగుల వివరాలపై ఆరా తీశారు. ప్రజలకు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అనంతరం పట్టణంలోని దేవి ఆస్పత్రిని (Devi Hospital) పరిశీలించారు. ఆ తర్వాత దోమకొండ సీహెచ్​సీ, భిక్కనూరు పీహెచ్​సీలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై వివరాలను తెలుసుకునేందుకు టీవీవీపీ, డీహెచ్​, డీఎంఈ, పబ్లిక్ హెల్త్ శాఖల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో జిల్లా ఆస్పత్రి, ఒక ప్రైవేట్ ఆస్పత్రి, సీహెచ్​సీ, పీహెచ్​సీ విజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగానే కామారెడ్డికి రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్​ చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ వెంకటేశ్వర్లు, ఇతర వైద్యులు పాల్గొన్నారు.