HomeతెలంగాణNizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ శాసనసభ్యుడు ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనలో విడుదల చేశారు. నీటి నిల్వలు, వ్యర్థాల వల్ల డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయన్నారు.

మురికినీటి కాల్వలు (water storage), విద్యుత్ స్తంభాలు, తీగలతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ప్రదేశాలలో హెచ్చరికల బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.