Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad RTC | మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

Nizamabad RTC | మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) గంజాయిని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్న్స పేర్కొన్నారు.

నషా ముక్తి భారత్ అభియాన్​లో (Nasha Mukthi Bharath abhiyaan) భాగంగా బుధవారం ఆర్ఎం కార్యాలయంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

డ్రగ్స్ రహిత జీవనశైలి పాటించడంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. బస్సుల్లో మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.