అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కోటగిరి (Kotagiri) గ్రామానికి చెందిన పాకాల నడిపి సాయిలు తన ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింక్‌ను ఓపెన్ చేయగా.. సైబర్ నేరగాళ్లు (Cyber criminals) ఆయన సిమ్‌ను స్వైప్ చేసి ఆయనకు వచ్చే మెసేజ్‌లను వారికి వచ్చేలా చేసుకున్నారు.
అనంతరం బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.5వేలు తస్కరించారు. దీనిని గుర్తించిన సాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సైబర్ క్రైమ్ పోర్టల్ (Cybercrime portal) ద్వారా అతడికి రూ.5000 రిఫండ్ చేయించారు.
ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులను మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కు గాని సైబర్ క్రైమ్ పోర్టల్‌లో గాని స్థానిక పోలీసులకు గాని వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.