ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Collector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా అధికారులు ఉండాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. కలెక్టరేట్​లో శనివారం సీజనల్​ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu) నిర్మాణం, వన మహోత్సవం(Vana Mahotsvam), నివేశన స్థలా క్రమబద్ధీకరణపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా ఆయా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

    Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి..

    ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలని, లబ్దిదారులకు ఐకేపీ(IKP), మెప్మా(MEPMA) ద్వారా ఆర్ధిక తోడ్పాటు కోసం అవసరమైన రుణాలు మంజూరు చేస్తూ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్​ పేర్కొన్నారు. గత రెండు వారాలతో పోలిస్తే ఇళ్ళ నిర్మాణాలలో ప్రగతి కనిపిస్తున్నప్పటికీ, మరింత పురోగతి సాధించేలా అకింత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ళ మంజూరీ పొందిన లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.

    Collector Nizamabad | వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ

    వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున, తప్పనిసరిగా ప్రతి గ్రామ పంచాయతీలో ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయించాలని.. అందుబాటులో ఉన్న అన్ని ఫాగింగ్ యంత్రాలు వినియోగించేలా చూడాలన్నారు. అవసరమైన వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని.. పిచికారీ మందులు పంచాయతీలలో సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

    Collector Nizamabad | తాగునీటిపై ప్రత్యేక ప్రణాళిక..

    మంచి నీటి వనరులలో గంబుషియా చేప పిల్లలను (Gambusia fish) వదలాలని, మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను సమకూర్చుకోవాలని అన్నారు. ఎక్కడైనా మలేరియాగంబుషియా చేప పిల్లల, డెంగీ, విష జ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదైతే, సత్వరమే స్పందించి పరిసర ఇళ్ళలో ఫాగింగ్, పిచికారి చేయించాలని సూచించారు. ప్రతీచోట ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం అమలయ్యేలా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు పక్కగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

    Collector Nizamabad | వనమహోత్సవంపై విచారణ..

    వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని, అన్నివిధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు. ఈ ఏడాది 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, పూర్తి స్థాయిలో మొక్కలు నాటి లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ (DPO Srinivas), డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ(DMHO rAJASRI), వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...