అక్షరటుడే, బాన్సువాడ: Cyber Crime | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీటీం సభ్యులు సూచించారు. నస్రుల్లాబాద్ మండలంలోని కొచ్చర మైసమ్మ ఆలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలు, మహిళలపై వేధింపులు, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ (Cyber blackmailing) వంటి నేరాలను ఎలా నివారించాలనే అంశాలపై వివరించారు.
సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ (Cybercrime toll free) నెంబర్ 1930 కాల్ చేయాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహిళలకు షీటీం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షీటీం (She Team) కానిస్టేబుల్ అనిల్, పోలీసు కళాజాత బృందం సభ్యుడు ప్రభాకర్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.