HomeUncategorizedRailway Department warns | మ‌ధ్య‌లోనే దించేస్తారు జాగ్ర‌త్త.. ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ హెచ్చ‌రిక‌

Railway Department warns | మ‌ధ్య‌లోనే దించేస్తారు జాగ్ర‌త్త.. ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ హెచ్చ‌రిక‌

- Advertisement -

Akshara Today News Desk: Railway Department warns : ప్ర‌యాణికుల‌కు రైల్వే railway శాఖ కీల‌క సూచ‌న చేసింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో రిజ‌ర్వేష‌న్ railway ticket reservation బోగీల్లో ప్ర‌యాణిస్తే భారీ జ‌రిమానా విధించ‌డంతో పాటు రైలు నుంచి దింపేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకుని ప్ర‌యాణం చేసే మిగ‌తా వారికి ఇబ్బంది క‌లుగ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రైల్వే శాఖ తెలిపింది.

Railway Department warns : కొంద‌రి వ‌ల్ల మిగ‌తా వారికి అసౌక‌ర్యం..

చాలా మంది ప్ర‌యాణికులు చివ‌రి క్ష‌ణంలో రిజ‌ర్వేష‌న్ చేసుకుంటారు. అయితే, అది వెయిటింగ్ లిస్టులో ticket reservation waiting list ఉన్న‌ప్ప‌టికీ, టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాక‌పోయినప్ప‌టికీ తాపీగా ట్రెయిన్ ఎక్కేస్తారు. టికెట్ బుక్ చేసుకున్నాం కాబ‌ట్టి వెయిటింగ్ టికెట్‌కు కూడా ఎంతో కొంత చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుంద‌నే ధీమా వారిలో క‌నిపిస్తుంది. టీటీ వ‌చ్చి అడిగితే ఆ టికెట్ చూపించి, ఎంతో కొంత జ‌రిమానా క‌ట్టి హాయిగా ప్ర‌యాణం చేస్తుంటారు. ఇలాంటి వారి వ‌ల్ల మిగ‌తా ప్ర‌యాణికులకు అసౌకర్యం క‌లుగుతుంది. ఏదో ఒక సీట్లో కూర్చోవ‌డం వ‌ల్ల టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన వారికి ఇబ్బంది క‌లుగుతుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో భార‌తీయ రైల్వే శాఖ indian railway కొత్త నిబంధ‌న తీసుకొచ్చింది.

Railway Department warns : ఇక మధ్యలో దించేసుడే..!

వెయిటింగ్ టికెట్‌తో railway waiting list ప్ర‌యాణించే వారిప‌ట్ల రైల్వే శాఖ ఇక నుంచి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఇక‌పై టికెట్ క‌న్ఫ‌ర్మేష‌న్ కాకుండా ప్ర‌యాణించ‌డం కుద‌ర‌దు. రిజ‌ర్వ్ కోచుల్లో టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాకుండా ప్ర‌యాణం చేస్తే ఫుల్ టికెట్ ఫేర్‌తో పాటు జ‌రిమానా కూడా క‌ట్టాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైతే రైలు నుంచి దించేస్తారు. ఈ నిర్ణ‌యాన్ని ట్రెయిన్ టికెట్ railway TT ఎగ్జామిన‌ర్‌కు క‌ట్ట‌బెట్టారు. ప్రయాణికులు ఈ కొత్త నిబంధ‌న‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌యాణాలు సాగించాల‌ని రైల్వే శాఖ సూచించింది.