Covid
Covid |

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Covid | కోవిడ్‌-19(Covid 19) కేసులు విస్త‌రిస్తున్న త‌రుణంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap Government) అడ్వైజ‌రీ జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాల‌ని ప్రజలకు సూచించింది. వృద్ధులు, గర్భిణులు క‌చ్చితంగా ఇంట్లోనే ఉండాల‌ని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఈ మేర‌కు విజ్ఞప్తి చేశారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాల‌ని సూచించింది. దగ్గు, తుమ్ములు వ‌స్తే చేతిని అడ్డం పెట్టుకోవాల‌ని పేర్కొంది. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది.

Covid | పెరుగుతున్న కేసులు..

కోవిడ్(Covid) ఉధృతి క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే సింగ‌పూర్‌(Singapoor), మ‌లేషియా(Malaysia) వంటి దేశాల్లో వీటి సంఖ్య పెరుగ‌గా, భార‌త్‌లోనూ కేసులు న‌మోదువుతున్నాయి. మే 19, 2025 నాటికి భారతదేశంలో యాక్టివ్ COVID-19 కేసుల సంఖ్య 257గా ఉంది. ఇది దేశంలోని పెద్ద జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. అయితే, వేగంగా విస్త‌రించే ప్ర‌మాద‌ముండ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(National Center for Disease Control), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(Indian Council of Medical Research) ఇటీవ‌ల స‌మావేశ‌మై క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌పై చ‌ర్చించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంద‌ని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటుంద‌ని కేంద్రం తెలిపింది.