అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eatala Rajendar | బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల సమయంలో హుజురాబాద్‌లో (Huzurabad) పార్టీకి ఓట్లు తక్కువ వచ్చేలా కొందరు పనిచేశారని ఆరోపించారు. అలాంటి వారికి స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. పార్టీలో వర్గాలు ఉండొద్దని ఆయన అన్నారు. ఏ వర్గం వారికి టికెట్ ఇవ్వమన్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ (Eatala Rajendar) వర్గం నాయకులు శనివారం హుజురాబాద్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చారు. తమ పరిస్థితి ఏమిటిని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajendar | సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు
సోషల్ మీడియాలో కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు తన వెంట ఉన్నారని చెప్పారు. విధి పోరాటాలు తమకు అవసరం లేదని, కుట్రలను తిప్పి కొడదామన్నారు. రాజకీయాల్లో అబ్బద్దపు పునాదుల మీద కొందరు బతుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేసే వారి గురించి అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
Eatala Rajendar | ధీరులతో కొట్లాడుతాం
ఈటల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం తెలియదని అన్నారు. తాము ధీరులతో కొట్లాడుతామని, కుట్రదారులతో కాదన్నారు. తనపై కుట్రలు చేస్తున్న వారికి ఈ సందర్భంగా ఈటల వార్నింగ్ ఇచ్చారు. బీ కేర్‌ఫుల్ కొడకా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను 2002లో రాజకీయంలోకి వచ్చానని, ఆయనెప్పుడు వచ్చాడని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District)లో తాను తిరగని గ్రామం లేదన్నారు. ‘‘నీ శక్తి ఎంది.. నీ యుక్తి ఎంది. నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడకా’’ అంటూ విరుచుకుపడ్డారు.