Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | విద్యుత్ ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలి

Bodhan | విద్యుత్ ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్ ప్రమాదాలపై ఎస్ఎన్ పురం జెడ్పీ హైస్కూల్​లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. విద్యుత్​తో అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ సూచించారు.

- Advertisement -

అక్షర టుడే, బోధన్: Bodhan | విద్యుత్ ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ (Rudrur ADE Thota Rajasekhar) అన్నారు. ఎస్ ఎన్ పురం జెడ్పీ హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి డాబాలపై జిఐ వైర్లపై (GI wires) బట్టలు ఆరేయ వద్దని, సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు.

ఇటీవల కోటగిరిలో విద్యుత్ వైర్ తెగిపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇళ్లలో నాణ్యమైన వైర్లను వాడాలని, ఇంట్లో విద్యుత్ పరికరాలను సొంతంగా రిపేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. అలాగే సోలార్ విద్యుత్(solar electricity)పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్ రెడ్డి, ఉపాధ్యాయుడు శ్యామ్, సబ్ ఇంజనీర్ బాలకిషన్, విద్యుత్ సిబ్బంది, లైన్ ఇన్ స్పెక్టర్ శ్రీరామ్ నాయక్, లైన్ మెన్ రామ్ చందర్, చిన్న బాబు, విద్యార్థులు పాల్గొన్నారు .