Homeజిల్లాలునిజామాబాద్​Electricity Department | విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Electricity Department | విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Electricity Department | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఏడీఈ తోట రాజశేఖర్ (ADE Thota Rajasekhar) అన్నారు.

పొతంగల్ (Pothangal) మండలంలో మంజీర నది బ్రిడ్జి వద్ద 33 కేవీ లైన్ నీటిలో ముంపునకు గురైన ట్రాన్స్ ఫార్మర్లను గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల (Ganesh Mandals) వద్ద ఇనుప స్తంభాలుంటే కరెంట్ షాక్ రాకుండా వాటికి ఇన్సులేషన్ మెటీరియల్ చుట్టాలన్నారు. తడిచేతులతో స్విచ్ బోర్డులు ముట్టవద్దని, సీరియల్ లైట్లు పిల్లలకు అందనంత ఎత్తులో వేయాలని సూచించారు.

ప్రతి మండపం దగ్గర భద్రతా ఫ్లెక్సీలో సంబంధిత లైన్ మెన్ నంబరు, టోల్ ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పోతంగల్ ఏఈ ఫక్రుద్దీన్, సిబ్బంది మీరా నారాయణ, లైన్ మెన్లు శ్రీనివాస్ రెడ్డి, ఖదీర్, దినేష్, గణేష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News