4
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief | పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. కులాలు పక్కన బెట్టి బీసీలంతా ఏకం కావాలని ఆయన అన్నారు. బీసీ (BC) అనే నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. ‘‘నేను గౌడ్ అని, ఈటల ముదిరాజ్ అని చెప్పుకోవడంతో పలచన పడుతున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ కులాలు ఎప్పుడూ ఏకం కావని అగ్రవర్ణాలు అంటున్నాయని ఆరోపించారు. ఐక్యంగా ఉంటే 50 శాతం.. విడిపోతే 1, 2 శాతానికి పడిపోతామన్నారు.