Homeక్రీడలుBCCI | బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక పాకిస్తాన్​తో నో మ్యాచ్​లు

BCCI | బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక పాకిస్తాన్​తో నో మ్యాచ్​లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: BCCI | పహల్గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attack నేపథ్యంలో బీసీసీఐ BCCI కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్​లోని Jammu Kashmir పహల్గామ్​లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని హతమార్చిన విషయం తెలిసిందే.

కాగా ఈ దాడి వెనుక పాకిస్తాన్​ pakistan పాత్ర ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది. దీంతో భవిష్యత్​లో పాకిస్తాన్​తో ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్​లు బీసీసీఐ ఉండవని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇండియా, పాక్ pak ద్వైపాక్షిక సిరీస్​లు ఆడటం లేదు. ఇండియన్​ టీం కూడా పాక్​కు వెళ్లడం లేదు.

ఐసీసీ icc టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. తాజా ఉగ్రదాడి అనంతరం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల bcci vice president rajiv shukla మాట్లాడుతూ. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్​లు ఆడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఐసీసీ indian cricket council కారణంగానే ప్రస్తుతం పాక్‌తో తటస్థ వేదికల్లో మ్యాచ్​లు ఆడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నామని ఆయన తెలిపారు.