Homeక్రీడలుBCCI | బీసీసీఐ ఖజానా దన్నుగా.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత సంపన్న బోర్డుగా రికార్డ్

BCCI | బీసీసీఐ ఖజానా దన్నుగా.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత సంపన్న బోర్డుగా రికార్డ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BCCI | ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న‌మైన బోర్డ్‌గా పేరుగాంచిన బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) తన ఆర్థిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

తాజాగా విడుదల చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం, బోర్డు బ్యాంక్ ఖాతాల్లో (Board Bank Account) ఈ ఏడాది మార్చి ముగిసే స‌మ‌యానికి రూ. 20,686 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,059 కోట్లు మాత్రమే ఉన్న బీసీసీఐ నికర ఆస్తులు, 2024 మార్చి నాటికి రూ. 20,686 కోట్లకు చేరినట్లు వెల్లడైంది. అంటే కేవలం ఐదేళ్లలో రూ. 14,627 కోట్ల అదనపు వృద్ధిని బోర్డు సాధించిందన్నమాట.

BCCI | ఆదాయపు పన్ను కోసం రూ. 3,150 కోట్లు

కేవలం 2023-24 సంవత్సరంలోనే బోర్డు సంపదలో రూ. 4,193 కోట్ల వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో బీసీసీఐ జనరల్ ఫండ్ రూ. 3,906 కోట్ల నుంచి రూ. 7,988 కోట్లకు పెరిగింది. ఆర్థిక పరంగా బీసీసీఐ పరుగులు పెడుతుండగా, మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం పెద్దగా తేడా క‌నిపించ‌డం లేదు. 2022-23లో మీడియా హక్కుల ద్వారా ₹2,524.80 కోట్లు రాబ‌ట్టిన బోర్డు, 2023-24లో కేవలం ₹813.14 కోట్లు మాత్రమే పొందగలిగింది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు (International Matches) నిర్వహించడమేనని, అలాగే 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇచ్చినందున మీడియా హక్కుల ఆదాయం తక్కువగా వచ్చిందని బోర్డు వివరించింది.

భారత జట్టు (India Squad) విదేశీ పర్యటనల ద్వారా వచ్చిన ఆదాయం కూడా ₹642.78 కోట్ల నుంచి ₹361.22 కోట్లకు పడిపోయింది. ఇక పన్నులు, అభివృద్ధి, సంక్షేమం తదితర ఖర్చులకు బీసీసీఐ భారీగా నిధులు కేటాయించింది . ఆదాయపు పన్ను చెల్లింపులకు: రూ. 3,150 కోట్లు, క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి: రూ. 1,200 కోట్లు, మాజీ క్రికెటర్ల సంక్షేమానికి (ప్లాటినం జూబ్లీ ఫండ్‌): రూ. 350 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు: రూ. 500 కోట్లు ఉప‌యోగించింది.

ఈ నెల సెప్టెంబర్ 28న ముంబైలో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి లెక్కలు, ఫ్యూచర్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు అధికారికంగా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్స్ వంటి మార్గాల్లో ఆదాయం గ‌ట్టిగానే ఆర్జిస్తూ, బోర్డు Boardతన ఖజానాను పెంచుకుంటుంది.

Must Read
Related News