IPL 2025 | ఐపీఎల్ కోసం బీసీసీఐ వ్యూహం.. ఆ రెండింట్లో ఒక‌టి ర‌ద్దు చేస్తారా..!
IPL 2025 | ఐపీఎల్ కోసం బీసీసీఐ వ్యూహం.. ఆ రెండింట్లో ఒక‌టి ర‌ద్దు చేస్తారా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | భారత్ – పాకిస్తాన్ (India – Pakistan) మధ్య ఉన్న ఉద్రిక్తతల వ‌ల‌న బీసీసీఐ ఐపీఎల్‌(IPL)ని ర‌ద్దు చేయ‌డం మ‌నం చూశాం. అయితే ఆ ఉద్రిక్త‌త‌ సమసిపోతే ఐపీఎల్ ఎటువంటి ఆటంకం లేకుండా మళ్లీ మొదలయ్యే అవకాశ ఉంటుంది. అలా కాకుండా యుద్ధానికి దారి తీస్తే మాత్రం బీసీసీఐ ఏం చేస్తుంద‌నే ప్ర‌శ్న‌లు అంద‌రిలో ఉత్ప‌న్నం అవుతున్నాయి. 12 లీగ్ మ్యాచ్ లతో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ(BCCI) నిర్ణయం తీసుకుంది. మొదట నిరవధిక వాయిదాగా భావించినప్పటికీ చివరకు వారం రోజులకు మాత్రమే పరిమితం చేసింది.భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉండే పరిస్థితులను బట్టి ఐపీఎల్ వారం తర్వాత మళ్లీ ఆరంభం అవుతుందా? లేదంటే వాయిదా పడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది.

IPL 2025 | ప్లాన్ ఏంటి?

అయితే.. బీసీసీఐ BCCI మాత్రం త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే మిగ‌తా 16 మ్యాచ్‌ల‌కు కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌రిత‌గ‌తిన టోర్నీ(Tournament)ని నిర్వ‌హించ‌డంపై దృష్టి సారించిన భార‌త బోర్డు.. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకొనే అవ‌కాశ‌ముంది. వాటిలో ఆసియా క‌ప్ Asia Cup ఆతిథ్యాన్ని వ‌దులుకోవ‌డం ఒక‌టి. రెండోది బంగ్లాదేశ్‌తో ప‌ర్య‌ట‌న Bangladesh Tour ను ర‌ద్దు చేసుకోవ‌డం. వీటిలో ఏదో ఒక‌టి సాధ్య‌మైనా ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో 18వ సీజ‌న్ తదుప‌రి మ్యాచ్‌లు ఆడించేందుకు వీలుంటుంది.

ప్ర‌స్తుతానికైతే లీగ్(League) నిర్వ‌హ‌ణ‌పై తుది నిర్ణ‌యానికి రాలేదు. అయితే.. ఈ మూడు రోజుల్లో ఏం జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాం. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక‌ కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టిస్తాం అని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపిన‌ట్టు క్రిక్ బ‌జ్(Cricket Buzz) వెల్ల‌డించింది. త‌దుప‌రి మ్యాచ్‌ల‌ను ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా రెండు మూడు డ‌బుల్ హెడ‌ర్‌లు ఆడించ‌డం ద్వారా త‌క్కువ స‌మ‌యంలోనే ఐపీఎల్‌ను పూర్తి చేయ‌వ‌చ్చని బీసీసీఐ అనుకుంద‌ట‌. మ‌రోవైపు ఆగ‌స్టులో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సి ఉంది. అదే స‌మ‌యంలో ఇంగ్లండ్ వేదిక‌గా ది హండ్రెడ్ లీగ్ The Hundred League షురూ కానుంది. ఆగ‌స్టు 5 నుంచి 31 వ‌ర‌కు జ‌రిగే ఈ లీగ్ కోసం విదేశీ ఆట‌గాళ్లు కొంద‌రు ఐపీఎల్‌ను వీడాల్సి రావ‌చ్చు. ఇక సెప్టెంబ‌ర్‌లో క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ CPL ఉంది. ఆగ‌స్టు 14 నుంచి సెప్టెంబ‌ర్ 21 వ‌ర‌కూ ఈ టోర్న‌మెంట్ ఉంటుంది. యితే.. బీసీసీఐ విన‌తి మేర‌కు వెస్టిండీస్ బోర్డు సీపీఎల్ తేదీల‌ను మార్చే అవ‌కాశం ఉంది.మ‌రి ఏం చేస్తారో చూడాలి.