అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్(IPL)ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్–పాక్ వైమానిక దాడులు(Air Strikes) చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్ను మధ్యలో నిలిపేసిన బీసీసీఐ. ఐపీఎల్ రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. క్రీడాకారులు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మళ్లీ ఐపీఎల్ నిర్వహిస్తారా? లేక ఈ సీజన్ రద్దయినట్లేనా? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.