Homeక్రీడలుBCCI | విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేసిన బీసీసీఐ

BCCI | విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేసిన బీసీసీఐ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ఐపీఎల్ 2025లో ఆర్సీబీ(RCB) విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సెల‌బ్రేష‌న్స్ కార్య‌క్ర‌మంలో తొక్కిసలాట(Stampede) జరిగి చాలా మందే మృతి చెందారు. ఈ ఘటనపై బీసీసీఐ(BCCI) తీవ్రంగా స్పందించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy) గెలుపు సంబురాల్లో తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా చూడ‌డం కోసం.. అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు చేసేందుకు త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ సెక్రెట‌రీ దేవ‌జిత్ సైకియా (Devjit Saikia) అధ్య‌క్షుడిగా ఉన్న ఈ క‌మిటీలో ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్ర‌భ్ తేజ్ సింగ్ భాటియా స‌భ్యులుగా ఉన్నారు.

BCCI | త్రిస‌భ్య క‌మిటీ..

ఆర్సీబీ విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ స‌మ‌యంలో బెంగ‌ళూరులో జ‌రిగిన తొక్కిస‌లాట(Bengaluru Stamped) మ‌మ్మ‌ల్ని ఎంతో క‌లిచి వేసింది. ఈ ఘ‌ట‌న నిజంగా దుర‌దృష్ట‌క‌రం. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చూడాల‌ని బీసీసీఐ భావించింది. అందుకే.. త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేశాం. ఆ క‌మిటీ త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేస్తుంది అని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ఆర్సీబీ విజేత‌గా నిల‌వ‌డంతో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం(Karnataka Government) విక్ట‌రీ ప‌రేడ్‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హిచింది. జూన్ 3న చిన్న‌స్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి సీఎం సిద్ధ‌రామ‌య్య‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌లు హాజ‌రై బెంగ‌ళూరు ఆట‌గాళ్ల‌ను స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని చూసేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్త‌డంతో వారిని అదుపు చేయ‌డంలో పోలీసులు విఫ‌లం అయ్యారు. 35 వేల మంది సామ‌ర్ధ్య‌మే ఉన్న స్టేడియంలోకి ల‌క్ష మందికి పైగా అభిమానులను పంప‌డంలో నిర్వాహ‌కులు స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో లేరు. గేట్ నంబ‌ర్ 2, 2ఏ, 6, 7, 15, 17, 18, 20, 21 నంబ‌ర్ గేట్ల వ‌ధ్య తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 56 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియాలో అంద‌రికి ప్ర‌వేశం ఉచితం అని పోస్ట్ పెట్ట‌డంతోనే అభిమానులు అంత‌గా వ‌చ్చారు. అందువ‌ల్లే తొక్కిస‌లాట జ‌రిగింది’ అని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన వాళ్ల కుటుంబాల‌కు ఆర్సీబీ యాజ‌మాన్యం రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సైతం బాధిత కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని తెలిపారు.

Must Read
Related News