అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Premier League 2025 : ఈ సీజన్ ఐపీఎల్‌లో అనేక హైలైట్స్ చోటు చేసుకుంటుండటం మనం చూశాం. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో AI రోబో కుక్క ఆకట్టుకుంటోంది. దానికి ‘చంపక్’ అని పేరు పెట్టింది బీసీసీఐ. AI రోబో కుక్కకు ‘చంపక్’ అని పేరు పెట్టడం ఇప్పుడు చిక్కుల్లో పడేసింది.
ఇది ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అవుతుందని పేర్కొంటూ పిల్లల పత్రిక చంపక్ Champak ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ రోబోటిక్ కుక్కను నిర్వాహకులు పరిచయం చేశారు. సోషల్ మీడియాలో రోబోటిక్ కుక్కకు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్ పేరుకే ఓటేశారని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు వెల్లడించారు.
Indian Premier League 2025 : బీసీసీఐకే షాక్..
చంపక్..నిజానికి ఒక ప్రసిద్ధ పిల్లల పత్రిక పేరు. ఈ క్రమంలో ఈ కంపెనీ, బీసీసీఐకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడం ద్వారా బీసీసీఐ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని పత్రిక డైరెక్టర్ల బోర్డు ఆరోపించింది. రోబో ROBO కుక్కకు చంపక్ అని పేరు పెట్టడంపై స్పందన కోరుతూ ఢిల్లీ హైకోర్టు బీసీసీఐకి నోటీసు జారీ చేసింది. 1968వ సంవత్సరం నుంచి తాము చంపక్ పేరుతో పిల్లల కోసం మ్యాగజైన్ ప్రచురిస్తున్నట్లు.. తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్ మార్కును వాడుకున్నారంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్‌లో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బీసీసీఐ, ఐపీఎల్ ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఐపీఎల్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి రోబోట్ డాగ్ చంపక్ అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు IPL ఆకర్షణీయంగా మారింది. బీసీసీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె.సాయి దీపక్ ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. చంపక్ అనేది ఒక పువ్వు పేరు అని.. ప్రజలు రోబో కుక్కను ఒక పత్రికతో కాకుండా ఒక టీవీ సీరీస్ లోని పాత్రతో పోల్చుకుంటారని అన్నారు.