అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | బీసీ ద్రోహులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులను (BC Welfare Association leaders) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar), సంఘం రాష్ట్ర నాయకులు సత్యప్రకాశ్, యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకర్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజామాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
BC Sankshema Sangham | రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం..
బీసీ రిజర్వేషన్లు (BC reservations) అమలయ్యేవరకు పోరాటం ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఎవరు అడ్డు వచ్చినా.. బీసీల హక్కులు సాధించుకునేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.