HomeతెలంగాణTelangana Bandh | బీసీ సంఘాల తెలంగాణ బంద్​ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Telangana Bandh | బీసీ సంఘాల తెలంగాణ బంద్​ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Telangana Bandh | బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్​ వాయిదా పడింది. ఈ నెల 14కు బదులుగా 18న బంద్​ నిర్వహిస్తామని బీసీ సంఘాల నేతలు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Bandh | స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ సంఘాలు ఈ నెల 14న బంద్​కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బంద్​ను వాయిదా వేస్తున్నట్లు బీసీ నేతలు తెలిపారు.

హైదరాబాద్ (Hyderabad)​లోని లక్డీకపూల్​లోని ఓ హోటల్​లో బీసీ సంఘాల నేతలు ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్‎ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న తెలంగాణ బంద్​ నిర్వహిస్తామని బీసీ నేత ఆర్​ కృష్ణయ్య తెలిపారు. బంద్​ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Telangana Bandh | జేఏసీ ఏర్పాటు

బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై అన్ని సంఘాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా బీసీ సంఘాలన్నీ బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. దీని ఛైర్మన్​గా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‎గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మెన్‎గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్‎ ఎన్నికయ్యారు.

Telangana Bandh | పెద్ద ఎత్తున ఉద్యమం

బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆర్​ కృష్ణయ్య అన్నారు. బీసీల్లోని ప్రతి కులం నుంచి నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని.. వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. బీసీలను చట్ట సభల్లో కూర్చోబెట్టేవరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పని చేశామో ఇప్పుడు కూడా అలాగే పోరాటాలు చేస్తామన్నారు. బీసీ ఉద్యమంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.