ePaper
More
    Homeతెలంగాణmlc kavitha | పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ల అమలు : ఎమ్మెల్సీ కవిత

    mlc kavitha | పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ల అమలు : ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : mlc kavitha | కాంగ్రెస్ పార్టీకి కుల గణనపై చిత్తశుద్ధి లేదని, ఆ నివేదిక కరెక్టే అయితే గ్రామ పంచాయతీల వద్ద పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) సాధించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. పోరాడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగ బద్దంగా 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం మెదక్ (Medak) జిల్లాలో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీల గొంతుకగా తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రoట్ పనిచేస్తుందన్నారు.

    mlc kavitha | 42 శాతం రిజర్వేషన్ సాధిస్తాం..

    కామారెడ్డి డిక్లరేషన్ సాధించేవరకు పోరాడుతాం, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) సాధించుకుంటామని కవిత తెలిపారు. అసెంబ్లీ గడపను ఎక్కని వాళ్లు ఎంతో మంది బీసీలు ఉన్నారని, బీసీలంతా చైతన్యం కావాలన్నారు. బీసీల మీటింగ్ కు ఎందుకు పోతారని అగ్రవర్ణాల నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇది రాజకీయ వేదిక కాదు.. మానవ హక్కుల వేదిక అని కవిత అన్నారు. బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పోరాడాల్సిన అవసరం ఉందని, అడగకపోతే తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మనం కొట్లాడితేనే అసెంబ్లీలో, మండలి లో కామారెడ్డి డిక్లరేషన్ పాస్ అయిందన్నారు. విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు వేర్వేరు బిల్లులు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

    mlc kavitha | జూలై 17న రైలురోకో

    ఢిల్లీకి బిల్లు పంపినం మాకు సంబంధం లేదని కాంగ్రెస్ అంటుందని కవిత విమర్శించారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో బీసీ బిల్లు గురించి మాట్లాడాలని, బిల్లు అమలయ్యే వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. బిల్లు గురించి బీసీలు ఎంపీని ప్రశ్నించాలని సూచించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయన్నారు. బీసీ బిల్లు సాధించాలంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అందుకే జూలై 17న రైలు రోకో చేపడదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతామని చెబుతుందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పొతే పోరాడుతామని హెచ్చరించారు. పోరాడితేనే బీసీ బిడ్డల కాళ్ల వద్దకు పదవులు వస్తాయని తెలిపారు.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this