అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ (CPM state committee member Prasad) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల (state assembly sessions) సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి కేంద్రానికి బిల్లును పంపాయన్నారు. కానీ రిజర్వేషన్ అమలుకు చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం (Central Government) మోసం చేస్తుందన్నారు. ముస్లింల సాకుగా చూపించి బలహీనవర్గాలకు నష్టం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్, నన్నే సాబ్, గంగాధర్, సుజాత, జె.గంగాధర్, విగ్నేష్, శ్రీనివాస్, రాములు, అనసూయమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.