అక్షరటుడే, హైదరాబాద్: BC Minister Ponnam | తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఘోర అవమానం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy కోసం కేటాయించిన లిఫ్టులో ఎక్కేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు అనుమతించలేదనే ప్రచారం జరుగుతోంది. కాగా.. అదే లిఫ్టులోకి తర్వాత పొంగులేటిని అనుమతించినట్లు తెలిసింది. ఈ విషయం అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది.
BC Minister Ponnam | అసలేం జరిగిందంటే..
మంత్రి వర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీకి (Assembly ) వచ్చారు. శాసనసభ ఆవరణలో లిఫ్టు ఎక్కే ప్రయత్నం చేశారు. అయిదే ఆ లిఫ్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిందని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. వేరే లిఫ్టులో వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించినట్లు సమాచారం.
దీంతో మంత్రి పొన్నం వేరే లిఫ్టులో వెళ్లిపోయారు. అయితే తర్వాత అదే లిఫ్టులో పొంగులేటి Ponguleti రావడం చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ షాకయ్యారు. వెంటనే పొన్నం కిందికి వెళ్లారు. తనను వద్దని లిఫ్టులో పొంగులేటికి ఎలా అనుమతి ఇచ్చారని సెక్యూరిటీ సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.
ఇద్దరం సమాన హోదాలోనే ఉన్నాం కదా అని సెక్యూరిటీ సిబ్బందిపై మంత్రి పొన్నం మండిపడ్డారు. బీసీ మంత్రి కాబట్టే వివక్ష చూపుతున్నారని అక్కడున్న పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.