అక్షరటుడే, ఇందూరు : BC Mayor | నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా బీసీ బిడ్డకు బాధ్యతలు అప్పగించామని.. అభివృద్ధిలో కాంగ్రెస్ మార్క్ కచ్చితంగా చూయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కూరగాయల ఉమారాణి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ కూడా బాధ్యతలు స్వీకరించింది.
BC Mayor | ప్రజల ఆలోచనల మేరకే పాలన..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని అలాగే మున్సిపల్ ఎన్నికలలోనూ ఆశీర్వదించారన్నారు. ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక బిల్లు పాసైంది ఇదే రోజన్నారు. ఇప్పటికీ 12 ఏళ్లు అయిందని కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపిస్తోందన్నారు.
BC Mayor | ఉద్యమకారులకు న్యాయం జరిగేలా..
తెలంగాణ ఉద్యమకారులకు కచ్చితంగా న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 250 గజాల స్థలానికి సంబంధించి త్వరలోనే కమిటీ వేసి తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు.
BC Mayor | ఎన్నికల వరకే రాజకీయాలు..
ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లకు సమన్యాయం చేయాలని మేయర్‌కు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారని అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.