అక్షరటుడే, వెబ్డెస్క్ : Gangula Kamalakar | బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీసీ నాయకుడు తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తన కుర్చీ పోతుందనే భయంతోనే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ కూడా బీసీలకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్(kcr) కూడా బీసీ నినాదంతో ముందుకు రానున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణకు బీసీ సీఎం అయ్యేఅవకాశముందని వెల్లడించారు.
Gangula Kamalakar | బీఆర్ఎస్‌ది కూడా బీసీ బాట
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని గంగుల కమలాకర్(Gangula Kamalakar) అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా బీసీ నినాదంతో ముందుకు రానున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలా తాము బీసీలను మోసం చేయబోమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలకు వెన్నుపోటు పొడిచాయన్నారు. వాస్తవానికి రేవంత్‌రెడ్డి కుర్చీ పోతుందనే భయంతో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే బీసీ రిజర్వేషన్ల(BC Reservations) జీవోపై కోర్టు స్టే విధించిందన్నారు. జీవోతో రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టేందుకు జీవో జారీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. బీసీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.